సర్జికల్ స్ట్రైక్ ఎలా ఉంటుందో చేతల్లో చూపిస్తాం..! బీజేపీ ఎమ్మెల్యే సంచలనం..

సర్జికల్ స్ట్రైక్ ఎలా ఉంటుందో చేతల్లో చూపిస్తాం..! బీజేపీ ఎమ్మెల్యే సంచలనం..

సంచలన వ్యాఖ్యలు చేశారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో.. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ తరపున ప్రచారం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. అసలు సర్జికల్ స్ట్రైక్ అంటే ఎలా ఉంటుందో చేతల్లో చూపిస్తాం అన్నారు.. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో రత్నప్రభ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. అసలు ప్రత్యేక హోదా గురించి ప్రజలు ఆలోచిస్తారని తాను అనుకోవడం లేదని.. హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అని శాసనసభలో తీర్మానం కూడా చేశారని గుర్తు చేశారు. 

ఇక, తిరుపతిలో అధికార వైసీపీ దెబ్బ తినబోతోంది అని జోస్యం చెప్పారు రఘునందన్ రావు... దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ లక్ష మెజార్టీ వస్తుందని చెప్పింది.. కానీ ఓటమిని చవిచూసింది.. తిరుపతిలో తమకు 5 లక్షల మెజార్టీ అని అధికార వైసీపీ చెప్పినా.. దుబ్బాక ఫలితమే ఇక్కడ రిపీట్ అవుతుందని వ్యాఖ్యానించారు. రాజకీయ రణరంగం నుంచి టీడీపీ తప్పుకుందని, ఏపీలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అని అన్నారు... వైసీపీకి ఓటు వేస్తె సంఖ్య పెరుగుతుంది తప్పించి ఉపయోగం ఉండదని, అధికారంలో ఉండి ప్రశ్నించలేని పార్టీకి ఓటెందుకు అని ప్రశ్నించారు... ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో రఘునందన్ రావు ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..