కేటీఆర్ అమెరికాలో చదువుకున్న అజ్ఞాని.. కేసీఆర్‌ను మంచిపోయారు..!

కేటీఆర్ అమెరికాలో చదువుకున్న అజ్ఞాని.. కేసీఆర్‌ను మంచిపోయారు..!

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి.. అమెరికాలో చదువుకున్న అజ్ఞాని.. కేటీఆర్‌ అని మండిపడిన ఆయన.. దుబ్బాక, గ్రేటర్ ఫలితాల తర్వాత మతి భ్రమించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇక, అబద్దాలు చెప్పటంలో కేటీఆర్ తన‌ తండ్రి కేసీఆర్‌ను మించిపోయాడు అని కామెంట్ చేసిన ఆయన.. ఐటీఐఆర్, ఖాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీపై మంత్రి కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు. నివాసయోగ్యమైన నగరాల జాబితాలో 4వ స్థా‌నం‌ నుంచి హైదరాబాద్‌ 24వ స్థానానికి పడిపోవటం కేటీఆర్ అసమర్థతేనని ఆగ్రహం వ్యక్తం చేసిన వివేక్... అంతే కాదు.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా కేటీఆర్ పూర్తిగా విఫలం అయ్యారని.. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో, దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో ఓడిపోయారని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వ అసమర్థత వలనే ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రాలేదని విమర్శించిన ఆయన.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్‌కు ప్రజలు చెంప దెబ్బ కొట్టబోతున్నారని జోస్యం చెప్పారు. మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో పెట్టడం ఇష్టం లేకనే కేంద్ర పథకాలను అమలు చేయటం లేదని ఎద్దేవా చేసిన వివేక్.. ముద్ర లోన్స్ పై కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.