జగన్ చెప్పిందే బాబు చేస్తున్నారు!

జగన్ చెప్పిందే బాబు చేస్తున్నారు!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మరోసారి ఫైర్ అయ్యారు బీజేపీ ఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు... ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు చేస్తున్నది అధర్మపోరాటం అని ఆయన ఆరోపించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏం చేస్తే... చంద్రబాబు అదే చేస్తున్నారంటూ సెటైర్లు వేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తులేకుండా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ పతనం ఖాయమన్నారు విష్ణుకుమార్ రాజు... ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందన్న ఆయన... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందన్నారు. 

2019 ఎన్నికల్లో పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు విష్ణుకుమార్ రాజు... దేశంలో 10 రాష్ట్రాలకు హోదా ఇచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చిందిలేని వెల్లడించారు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు... ఆదినుంచి ప్రత్యేక హోదా కోసం జగన్ ఫైట్ చేస్తున్నారని ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారని ఆరోపించారు. జగన్ ఏది చేస్తే చంద్రబాబు అది చేస్తున్నారని... ఆయన కాపీ ఉద్యమమని సెటైర్లు వేశారు విష్ణుకుమార్ రాజు.