బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు.. ఏ క్షణంలోనైనా జగన్ బెయిల్ రద్దు..!

బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు.. ఏ క్షణంలోనైనా జగన్ బెయిల్ రద్దు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ డియోదర్... తిరుపతిలో నిర్వహించిన కాపు సంక్షేమశాఖ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్.. బెయిల్ పై తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు.. అయితే, వైఎస్ జగన్ బెయిల్ ఏ క్షణమైనా రద్దు అయ్యే అవకాశం ఉందని హాట్ కామెంట్లు చేసిన సునీల్ డియోదర్... బెయిల్ పై ఉన్న వ్యక్తి రాష్ట్రానికి సీఎంగా కొనసాగుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ఇక, అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని కామెంట్ చేసిన ఆయన.. భవిష్యత్తులో మాజీ సీఎం చంద్రబాబు కూడా జైలుకు వెళ్తారు అంటూ జోస్యం చెప్పారు. కాగా, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలు జరుగుతోన్న సమయంలో.. గెలుపుకోసం.. అధికార వైసీపీతో పాటు.. టీడీపీ, బీజేపీ-జనసేన పార్టీ కూడా తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.. మరోవైపు.. ప్రచారంలో ఆరోపణల్లో, విమర్శలు తీవ్రత పెరిగిపోతోంది.