తెలంగాణలో అన్ని ఉద్యోగాలు కల్వకుంట్ల కుటుంబానివే

తెలంగాణలో అన్ని ఉద్యోగాలు కల్వకుంట్ల కుటుంబానివే

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో  ఓబీసి జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా లక్ష్మణ్ మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక  ఉద్యోగాలు లేవు,  నిరుద్యోగ భృతి లేదని ఫైర్ అయ్యారు. దళిత ముఖ్యమంత్రి అన్నారని.. బీసీల  అభ్యున్నతికి 25 కోట్ల ఇస్తామన్నారు ఏమయ్యంది ఈ ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వమని విమర్శలు చేశారు. తెలంగాణ  కేవలం కల్వకుంట్ల కుటుంబం కోసమని.. కేసీఆర్  మనవుడికి వయస్సు వుంటే ఎమ్మెల్సీ లేదా  రాజ్యసభ సభ్యులుగా చేసే వారని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో కెసిఆర్ మనువడు ఒక్కడే నిరుద్యోగి అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఉద్యోగులు కల్వకుంట్ల కుటుంబానివే అని మండి పడ్డారు.  ఎక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు  కనిపించడం లేదని ఫైర్ అయ్యారు.కాంగ్రెస్ కు ఓటు వేస్తే  బురద లో వేసినట్లే...బిజెపికి వేస్తే అభివృద్ధికి పునాది పడుతుందని తెలిపారు.