అధికారం మాదే..! టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోకి...!

అధికారం మాదే..! టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోకి...!

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ప్ర‌క‌టించిన 70 మంది స‌భ్యుల టీమ్‌లో చోటు ద‌క్కించుకున్నారు తెలంగాణ ఫైర్ బ్రాండ్ డీకే అరుణ‌... బీజేపీ జాతీయ ఉపాధ్య‌క్షురాలిగా డీకే అరుణ‌ను నియ‌మించారు జేపీ న‌డ్డా.. ఇక‌, దీనిపై ఆనందాన్ని వ్య‌క్తం చేసిన డీకే అరుణ‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామ‌ని వెల్ల‌డించారు... రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయే అనే న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు డీకే అరుణ‌.. 

టీఆర్ఎస్‌ ప్రభుత్వం అబద్ధపు ప్రచారాల్ని ప్రజల్లో ఎండ‌గ‌డ‌తామ‌ని ప్ర‌క‌టించారు డీకే అరుణ.. టీఆర్ఎస్‌పై పోరాడుతారా? లేదా? అని నేను పార్టీలో చేరేటప్పుడే కేంద్ర నాయకత్వాన్ని అడిగాను... పోరాడుతామని హామీ ఇచ్చారు.. నాకు బాధ్యత ఇవ్వడం దానికి సంకేత‌మే అన్నారామె. చాలా మంది బీజేపీలోకి చేరుతారు... అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా ఉన్నారు.. వారంతా బీజేపీలో చేర‌తారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జాతీయస్థాయిలో బాధ్య‌త‌లు అప్ప‌గించినా ఫోకస్ మాత్రం రాష్ట్రంపైనే ఉంటుంద‌న్నారు డీకే అరుణ‌.