కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన బీజేపీ- జనసేన నేతల బృందం...

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన బీజేపీ- జనసేన నేతల బృందం...

కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీజేపీ- జనసేన నేతల ప్రతినిధి బృందం కలిశారు. అనంతరం బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ... తిరుపతి లోకసభ ఉపఎన్నిక ప్రచార ప్రక్రియ కొనసాగుతుండగానే,  ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తూ లేఖ వ్రాయడం అభ్యంతరకరం అని తెలిపారు.జిల్లా స్థాయు అధికారులు లోకసభ స్థానానికి పోటీచేస్తున్న “నవతరం” పార్టీ  కి ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో పోటీచేస్తున్న “జనసేన” ఎన్నికల గుర్తు అయిన “గ్లాసు” ను కేటాయించడం గందరగోళానికి దారితీసింది. రాష్ట్రంలోని అధికార  వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ పూర్వకంగానే ఇలా చేసిందని అనుమానించాల్సి వస్తోంది అని తెలిపారు. 

చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో విస్తరించి ఉన్న లోకసభ స్థానానికి ఓ వైపు ఉప ఎన్నిక జరుగుతుండగా, ఆ రెండు జిల్లాలలో ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ రెండు ఎన్నికలలో “గ్లాసు” ఎన్నికల గుర్తు పై రెండు పార్టీ లకు చెందిన అభ్యర్థులు పోటీచేస్తున్నారు. పైగా, ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఏప్రిల్ 8 వ తేదీన జరగనున్నాయు. ఈ రెండు జిల్లాలలో 48 గంటలు ముందుగానే ప్రచార ప్రక్రియ ను నిలుపుదల చేయాలి. ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఏప్రిల్ 8 వ తేదీన కాగా, తిరుపతి ఉప ఎన్నిక ఏప్రిల్ 17 వ తేదీ న జరగనుంది.  ఆలాంటప్పుడు, ఈ రెండు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న తిరుపతి లోకసభ ఉప ఎన్నిక ప్రచార ప్రక్రియ మొత్తం మూడు రోజుల పాటు నిలితిపోయే పరిస్తితి ఉత్పన్నమౌతుంది. ఈ విషయాన్నే ఈసీ దృష్టికి తీసుకువెళ్లాము అని పేర్కొన్నారు. సహజసిధ్ధమైన ఎన్నికల ప్రచార ప్రకియ కు విఘాతం కలుగుతుంది. “జనసేన” పార్టీ ఎన్నికల గుర్తు “గ్లాసు” ను మరో పార్టీ కి కేటాయించి ప్రజలలో అధికార యంత్రాంగం అయోమయం సృష్టించింది. కేంద్ర ఎన్నికల సంఘం తగు నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం అని అన్నారు.