ఎన్నికల సిత్రాలు.. నిన్న కన్నీరుమున్నీరు.. ఇవాళ డ్యాన్స్‌లు..

ఎన్నికల సిత్రాలు.. నిన్న కన్నీరుమున్నీరు.. ఇవాళ డ్యాన్స్‌లు..

ఎన్నికలు వచ్చాయంటే ఎన్నో సిత్రాలు చూడాల్సి వస్తుంది.. కొత్త తరహాలో ప్రచారం చేయడం.. వారితో కలిసి పోవడం.. వారు చేసే పనిలో పాలుపంచుకోవడం.. బోరుమని విలపిస్తూ ఓటు కోసం ప్రాధేయపడడం.. కాళ్లు ముక్కడం.. చేతులు మొక్కడం.. అబ్బో ఒక్కటేంటి.. ఎన్నికల ప్రచారం వచ్చిందంటే చాలు.. మన నేతలు జీవిస్తుంటారు. ఫొటోలకు పోజులిస్తుంటారు.. ఇక, విషయానికి వస్తే.. నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతోన్న ఉప ఎన్నికల్లో.. కొత్త కొత్త సిత్రాలు చూడాల్సి వస్తుంది.. పోటీ అయితే చేశాను.. నాకు ధైర్యం సరిపోవడంలేదు.. ఓటు వేయండి అంటూ నిన్న బోరుమని ఓటర్ల ముందు విలపించిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పానుగోతు రవికుమార్ నాయక్.. ఇవాళ మాత్రం జోష్‌లోకి వచ్చేశారు.. గాత్రిపురారం మండలం అల్వాలపాడు తండాలో ప్రచారం నిర్వహించిన ఆయన.. స్థానిక గిరిజనులతో కలిసిపోయారు.. వారితో కలిసి కాలుకదిపారు.. లయబద్ధంగా నృత్యం చేశారు రవి నాయక్.. మొత్తంగా.. నిన్నటి ప్రచారంలో లబోదిబోమని ఏడ్చి వైరల్ అయిన బీజేపీ అభ్యర్థి.. ఇవాళ మాత్రం డ్యాన్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.