డబ్బు కట్టలతో పరుగులు తీసిన బీజేపీ కార్యకర్తలు

డబ్బు కట్టలతో పరుగులు తీసిన బీజేపీ కార్యకర్తలు

దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇళ్లలో, కార్యాలయాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. సిద్దిపేటలో రఘునందన్‌రావు అత్తారిల్లు, బంధువుల ఇళ్లలో సోదాలు జరిపారు. ఈ సోదాల్లో రఘునందన్ రావు బంధువుల ఇంట్లో రూ.18.67 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల విషయం తెలుసుకున్న ఆయన దుబ్బాకలో తన ప్రచారాన్ని మధ్యలోనే నిలిపివేశారు. అక్కడి నుంచి ఆయన సిద్దిపేటలోని తన అత్తారింటికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లడానికి ఆయన ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆయనకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బీజేపీ కార్యకర్తలు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. స్వాధీనం చేసుకున్న నగదును లాకెళ్ళుతూ పరుగులు తీశారు కార్యకర్తలు. అనంతరం ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తనిఖీల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నోటీసులు ఇవ్వకుండా తనిఖీలు ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. తన ఇంట్లో సోదాలు నిర్వహించినట్లే హరీశ్ రావు ఇంట్లో కూడా సోదాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.