నిజామాబాద్ జిల్లాకి బర్డ్ ఫ్లూ భయం.. 200 కోళ్ళు మృత్యువాత !

నిజామాబాద్ జిల్లాకి బర్డ్ ఫ్లూ భయం.. 200 కోళ్ళు మృత్యువాత !

దేశంలో ఒక పక్క బర్డ్ ఫ్లూ టెన్షన్ కొనసాగుతోంది. ఇప్పటికే పది రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా..డి చ్ పల్లి మండలం యానంపల్లి తండా సమీపంలోని ఓ రైతు పౌల్ట్రీ ఫారంలో 200 కోళ్ళ మృతి వాత పడ్డాయి.. ఒక్కసారిగా భారీ ఎత్తున కోళ్లు మృత్యువాత పడడంతో గ్ బర్డ్ ఫ్లూ అనుమానంతో గ్రామస్తులలో ఆందోళన నెలకొంది. మృతి చెందిన కోళ్లను నిర్వాహకులు గుంత తీసి పూడ్చి పెట్టారు. నిర్వాహకులు జిల్లా పశు వైద్య అధికారులకు  సమాచారం ఇవ్వడం తో సంఘటన స్థలాన్ని జిల్లా పశు వైద్య అధికారుల బృందం తనిఖీ చేశారు.. కోళ్లను పరిశీలించిన అధికారులు బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని ప్రాథమిక అంచనాకు వచ్చారు. గ్రామస్తులు ఎవరు ఆందోళన చెందవద్దని జిల్లా వైద్య అధికారులు తెలిపారు.. కోళ్ల రక్తనమూనాలను హైదరాబాద్ ల్యాబ్ కు వైద్యాధికారులు పంపించారు.