ధోనీకి గట్టిగా తగిలిన బర్డ్ ఫ్లూ

ధోనీకి గట్టిగా తగిలిన బర్డ్ ఫ్లూ

దేశవ్యాప్తంగా బర్డ్‌ఫ్లూ భయం.. ఎక్కువవుతోంది. వందలాది పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇప్పటికే ఏడు రాష్ట్రాలను తాకిన ఈ వైరస్‌.. తాజాగా మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లోనూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా సోకిన రాష్ట్రాల సంఖ్య పదికి చేరింది. అయితే.. తాజాగా టీం ఇండియా మాజీ కెప్టెన్‌ ధోనికి బర్డ్‌ ఫ్లూ టెన్షన్‌ పట్టుకుంది.  ధోని ప్రారంభించిన కోళ్ల వ్యాపారానికి బర్డ్‌ఫ్లూ సెగ తగిలింది. బర్డ్‌ ఫ్లూ వైరస్‌ దేశంలో విస్తరిస్తున్న నేపథ్యంలో ధోని ఆర్డర్‌ చేసిన రెండు వేల కడక్‌ నాథ్‌ కోళ్లను, గ్రామప్రియ కోళ్ల ఆర్డర్‌ను రద్దు చేసుకున్నట్లు ధోని ఫాం హౌజ్‌ ప్రతినిధి పేర్కొన్నారు. ధోని కొనుగోలు చేసిన కోళ్లు రవాణాకు సిద్ధమైన తరుణంలో బర్డ్‌ ఫ్లూ బారీన పడ్డాయని కోళ్ల పెంపకదారుడు డాక్టర్‌ విశ్వరాజన్‌ ధృవీకరించారు. దీంతో కోళ్ల ఆర్డర్‌ను పూర్తిగా ధోని రద్దు చేసుకున్నట్లు పేర్కొన్నారు.  ఈ బర్డ్‌ ఫ్లూ ప్రభావం ముఖ్యంగా మధ్య ప్రదేశ్‌, కేరళ, రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. కాగా.. ఇటీవలే క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన ధోనీ, రాంచీలోని తన 43 ఎకరాల ఫాం హౌజ్‌లో ఆర్గానిక్‌ పౌల్ట్రీ పరిశ్రమను నెలకొల్పాడు. ఈ నేపథ్యంలోనే బర్డ్‌ ఫ్లూ ఈ మాజీ కెప్టెన్‌ బిజినెస్‌కు తల నొప్పిగా మారింది.