నానికి బైపోలార్ సమస్య... నిజమేనా..?

నానికి బైపోలార్ సమస్య... నిజమేనా..?

ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకపోతున్నాడు నాచురల్ స్టార్ నాని. ఓ వైపు హీరోగా మరో వైపు ప్రొడ్యూసర్ గా హిట్స్ అందుకుంటున్నాడు. అయితే నాని ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వి' సినిమాలో నటించాడు. కానీ కరోనా కారణంగా ఈ  సినిమా విడుదలకు నోచుకోలేదు. అయితే ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే తన తరువాత సినిమాను అనౌన్స్ చేసాడు నాని. నిన్ను కోరి సినిమా తో హిట్ అందించిన శివా నిర్వాణ దర్శకత్వంలోనే నాని "టక్ జగదీష్" సినిమా చేస్తున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలి కానీ లాక్ డౌన్ కారణంగా అది వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సినీ వర్గాల్లో చెక్కర్లు కొడుతుంది. అదేటంటే... ఈ సినిమాలో నానికి బైపోలార్ అనే సమస్య ఉంటుందట! అయితే ఈ సమస్య ఉన్నవారు ఏ ఎమోషన్ కు అయిన విపరీతంగా రియాక్ట్  అవుతారు. అలాగే వారి మూడ్ కూడా స్వింగ్ అవుతుంటుంది. ఇక ఈ సినిమాలో నానికి జంటగా ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ఒకరు రీతూవర్మ మరో హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా హరీష్ పెద్ది సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.