మొదలైన ఆర్జీవీ బయోపిక్

మొదలైన ఆర్జీవీ బయోపిక్

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. రాము అనే టైటిల్ తో ఈ సినిమాను బొమ్మాకు మురళి  నిర్మిస్తుండగా. 20 ఏళ్ల కుర్రాడు దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఇటీవల విడుదల చేసాడు ఆర్జీవీ. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టారు. హైదరాబాద్ లో మొదలైన ఈ సినిమా షూటింగ్ ను ఆర్జీవీ సోదరి విజయ్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఆర్జీవీ తల్లిగారైన సూర్యావతి కెమెరా స్విచ్ ఆన్ చేసారు. కాలేజ్ డేస్ లో ఆర్జీవీ ఎలా ఉండేవాడు అనే అంశాన్ని షూట్ చేయనున్నారు. నూనూగుమీసాల కుర్రాడిగా ఈ మూవీ దర్శకుడు దొరసాయి తేజనే నటిస్తుండడం ఆసక్తికరం. ఈ బయోపిక్ మూడు భాగాలుగా ఉంటుందని..మూడు సినిమాలు కలిపి 6 గంటలు ఉంటుందని ఆర్జీవీ ఇంతకుముందు వెల్లడించారు. ఈ ఫ్రాంఛైజీలో తొలి భాగం నేడు మొదలైంది. 2గంటల నిడివితో ఇది ప్రేక్షకులకు ట్రీట్ ఇవ్వబోతుంది. `తొలి భాగం మొదలెట్టేశామోచ్!` అంటూ ఆర్జీవీ ట్వీట్ చేసారు.