బిల్ గేట్స్ ఇంట విషాదం..!

బిల్ గేట్స్ ఇంట విషాదం..!

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇంట విషాదం నెలకొంది. బిల్ గేట్స్ తండ్రి విలియమ్ గేట్స్ నిన్న కన్నుమూశారు. ఈ విషయాన్ని బిల్ గేట్స్ వెల్లడించారు. తన తండ్రికి 94ఏళ్ల వయస్సు ఉంటుందని పేర్కొన్నారు. కొద్దిరోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించిందని తెలిపారు. కుటుంబ సభ్యుల మధ్యే తన తండ్రి కన్ను మూశారని తెలిపాడు. అంతే కాకుండా తన తండ్రిని చాలా మిస్ అవుతున్నానని బిల్ గేట్స్ పేర్కొన్నారు. తన తండ్రికి ఉన్న గొప్ప మేధస్సు, ఉదరత తో ఎంతోమందిని ప్రభావితం చేసారని చెప్పారు. తాను స్థాపించిన బిల్ అండ్ మిలిందా ఫౌండేషన్ లో తన తండ్రి పాత్ర ఎంతో ఉందని అన్నారు. అసలైన బిల్ గేట్స్ తన తండ్రే అని ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు.