బాలి కి పంపేయమంటున్న శ్రద్ధాదాస్!

బాలి కి పంపేయమంటున్న శ్రద్ధాదాస్!

రోజు రోజుకూ ఎండలు మండిపోతున్నాయి. గత యేడాది కరోనా వచ్చిన సందర్భంగా లాక్ డౌన్ లో ఇంటిలోనే విశ్రాంతి తీసుకున్న చాలామంది సెలబ్రిటీస్... ఒక్కసారి లాక్ డౌన్ తొలగించే సరికీ సుందర సాగర తీరాలకు, ద్వీపాలకు వెళ్ళిపోయి సేద తీరారు. బహుశా ఇండోనేషియా లోని బాలి ద్వీపాలతో గ్లామర్ క్వీన్ శ్రద్దాదాస్ కు మంచి అనుబంధం ఉన్నట్టుంది. అందుకే గతంలో బాలిలో జలకాలాడిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, 'నన్ను ఎలాగైనా బాలికి బట్వాడా చేసేయండీ... ఈ రెండో లాక్ డౌన్ లో ముంబైలో గడపలేను' అంటూ మొరపెట్టుకుంటోంది. మరి అక్కడకు వెళ్ళిన తర్వాత తిరిగి ముంబైకు రావడం కష్టమైతే ఏం చేస్తుందో తెలియదు. అన్నట్టు ప్రస్తుతం తెలుగులో హీరోయిన్ గా నటించకపోయినా... కొన్ని సినిమాల్లో శ్రద్ధాదాస్ కీలక పాత్రలు పోషిస్తోంది. అందులో ఆమె నటించిన 'ఏక్ మినీ కథ' త్వరలోనే విడుదల కానుంది.