పోలీసుల నుండి తప్పించుకున్న దొంగ.. చితకబాదిన స్థానికులు !

పోలీసుల నుండి తప్పించుకున్న దొంగ.. చితకబాదిన స్థానికులు !

ఒక్కోసారి ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఎటు వెళ్ళినా రిస్క్ లో పడతామని తెలిసినప్పుడు తక్కువ రిస్క్ ఉన్న దారినే ఎంచుకుంటాం. అలానే ఒక దొంగ పొరపాటున రాంగ్ గెస్ చేసి పోలీసుల చేతిలో చిక్కుకున్నాడు. హైదరాబాద్ లోని బేగం బజార్ లో ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. బేగం బజార్ లో బైక్ దొంగతనం చేసిన దొంగని అక్కడి స్థానికులు చితకబాదారు. ఘటనకు సంబందించిన వివరాల్లోకి వెళ్తే ఈ రోజు గాంధీభవన్ వద్దనున్న పటేల్ నగర్ లో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో చోరీ చేసిన బైక్ తో పారిపోతున్న ఒక దొంగను పోలీసులు పట్టుకున్నారు. అయితే వారం నుంచి చాకచక్యంగా తప్పించుకున్న దొంగ బేగం బజార్ లోకి ప్రవేశించాడు. అయితే పోలీసుల నుంచి తప్పించుకున్న దొంగను స్థానికులు చితకబాదారు. నిందితుడిని చివరికి బేగం బజార్ పోలీసులకు అప్పగించారు.