క్వారెంటైన్ కు వెళ్లిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్... 

క్వారెంటైన్ కు వెళ్లిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్... 

బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. సీజన్ వన్ నుండి ప్రేక్షకుల ఆదరణ ఏమాత్రం తగ్గటం లేదు. ఇక ఇప్పటివరకు మూడు సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ షో నాలుగవ సీజన్ ను కూడా ప్రారంభించేందుకు షో నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటివరకు జరిగిన మూడు సీజన్లను ముగ్గురు హోస్ట్ చేసారు. కానీ ఇప్పుడు జరగబోయే నాలుగో సీజన్ ను మాత్రం గత సీజన్ హోస్ట్ చేసిన నాగార్జున  నే హోస్ట్ చేస్తున్నాడు. ఇక ఇందులో కంటెస్టెంట్ లు ఎవరు అన్నది ప్రేక్షకుల్లో ఇంకా ప్రశ్నగా మిగిలిపోయింది. తాజా సమాచారం ప్రకారం ఈ సీజన్ ఈ నెల 30 న ప్రారంభం అవుతుందంట! అందుకే ఇందులో పాల్గొనే  కంటెస్టెంట్స్, సిబ్బంది అందరూ క్వారెంటైన్ కు వెళ్లినట్లు తెలుస్తుంది. అయితే  బిగ్ బాస్ సెట్ సమీపంలోనే వీరిని నిర్బంధంలో ఉంచినట్లు అక్కడ నుండి నేరుగా బిగ్ బాస్ సెట్ లోకి పంపించబోతున్నారు అని తెలుస్తుంది. ఇక స్టేజ్ పైకి వారిని ఆహ్వానించే సమయంలో మాస్క్ లు, అలాగే సోలో ఎంట్రీలతో ఇంతక ముందు సీజన్ ల కంటే ఈ సీజన్ కొత్తగా ఉంటుంది అని తెలుస్తుంది.