మరోసారి నా దేవుణ్ణి కలుసుకున్నాను: అషురెడ్డి

మరోసారి నా దేవుణ్ణి కలుసుకున్నాను: అషురెడ్డి

బిగ్‌బాస్‌ ఫేమ్ బ్యూటీ అషూరెడ్డికి పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదనుకుంటా. పవన్ కళ్యాణ్ పేరును పచ్చబొట్టు పొడిపించుకుని అప్పట్లో అషు రెడ్డి హాట్ టాపిక్ అయ్యింది. అప్పట్లో ఆ టాటూతో తన అభిమాన నటుడు పవన్ ని కలిసి నెట్టింట్లో సందడి చేసింది. తాజాగా అషూ రెడ్డి షూటింగ్‌లో భాగంగా రీసెంట్‌గా పవన్‌కల్యాణ్‌ను కలిసి మాట్లాడింది. తర్వాత పవన్‌కల్యాణ్‌తో  కలసి ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకుంది అషూరెడ్డి.. ‘ఈరోజు నా దేవుడిని మరోసారి కలుసుకున్నాను. ఆయన మాట్లాడుతున్నప్పుడు తన పేరుపై వేయించుకున్న టాటూ కూడా ఆయనకు గుర్తుందని ఆయన చెప్పారు. రెండు గంటలు నాతో సంభాషణలు చేశారు. పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ నా ఫస్ట్ లవ్.. తిరిగి వచ్చేటప్పుడు ఆయన స్వయంగా రాసిన లెటర్‌ ఇచ్చారు. ఈ అవకాశం కలిగించిన డైరెక్టర్‌ క్రిష్‌కు కృతజ్ఞతలు’ అని తెలియజేసింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashu Reddy (@ashu_uuu)