కరోనా : ప్రాణాలను ఫణంగా పెడుతున్న జర్నలిస్టులు 

కరోనా : ప్రాణాలను ఫణంగా పెడుతున్న జర్నలిస్టులు 

మధ్యప్రదేశ్‌లో ఓ జర్నలిస్టుకు కరోనా పాజిటివ్‌ రావడం కలకలం సృష్టిస్తోంది. ఆ జర్నలిస్ట్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు హాజరు కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఆ జర్నలిస్ట్‌తో సన్నిహితంగా మెలిగిన వాళ్లందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కమల్‌నాథ్‌తో పాటు సమావేశానికి హాజరైన జర్నలిస్టులందర్నీ స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశించారు.. జర్నలిస్ట్‌ కుమార్తెకు గతంలో పాజిటివ్‌ రావడంతో ఆమె ద్వారానే ఇతనికి కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. 
 
విధినిర్వహణలో జర్నలిస్టులు తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. పాకిస్తాన్‌లో ముగ్గురు జర్నలిస్టులకు కరోనా సోకింది. న్యూస్‌ 24 చానల్‌కు చెందిన ఇద్దరు, అబ్‌తక్‌ ఛానల్‌కు చెందిన ఓ రిపోర్టర్‌కు కరోనా పాజిటివ్‌ రిపోర్ట్స్‌ వచ్చాయి. దీంతో ఆయా చానళ్లలో కొంతమందికి క్వారంటైన్‌ విధించారు. అంతకుముందు ఓ న్యూస్‌ పేపర్‌కు చెందిన ముగ్గురికి కరోనా లక్షణాలు కనిపించడంతో వారిని క్వారంటైన్‌లో ఉంచారు.