పవన్ స్టేట్ రౌడీ.. జనసైనికులు ఆకు రౌడీలు.. ఎమ్మెల్యే కౌంటర్

పవన్ స్టేట్ రౌడీ.. జనసైనికులు ఆకు రౌడీలు.. ఎమ్మెల్యే కౌంటర్

భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది... తాజాగా పవన్ చేసిన కామెంట్లకు ఇవాళ కౌంటర్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గ్రంథి... పవన్ కల్యాణ్ స్టేట్ రౌడీ అని వ్యాఖ్యానించిన ఆయన.. ఇక, జనసైనికులు ఆకు రౌడీలు అంటూ ఫైర్ అయ్యారు. అంతేకాదు.. అవగాహనాలోపంతో పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు అజ్ఞానంతో మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేసిన గ్రంథి శ్రీనివాస్... ఆయన ఓ మానసిక రోగి అంటూ హాట్ కామెంట్లు చేశారు. ఇక, మీరు తలలు నరికితే నరికించుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నామని పవన్‌కు సవాల్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే.. నన్ను పిచ్చికుక్కల వ్యాన్‌లో వేసి పంపుతామన్నారు.. మరి.. గత ఎన్నికల్లో రెండు చోట్ల అదే వ్యాన్‌లో ప్రజలు మిమ్మల్ని వేసి పంపించారు మర్చిపోవద్దంటూ కౌంటర్ ఎటాక్ చేశారు.