రివ్యూ: భీష్మ 

రివ్యూ: భీష్మ 

నటీనటులు: నితిన్, రష్మిక, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు 

మ్యూజిక్: మహతి స్వరసాగర్ 

సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్ 

నిర్మాత: నాగవంశీ 

దర్శకత్వం: వెంకీ కుడుముల

అ ఆ సినిమా తరువాత నితిన్ కు సరైన హిట్ దొరకడం లేదు. తప్పకుండా హిట్ అవుతాయని అనుకున్న సినిమాలు బోల్తా కొట్టాయి.  దీంతో నితిన్ కొంత గ్యాప్ తీసుకొని ఛలో వంటి మంచి హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమా చేశాడు.  రష్మిక హీరోయిన్ గా చేసిన ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయ్యింది.  బీష్మ ప్రేక్షకులను ఆకటుకుందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  

కథ: 

ఇటీవల కాలంలో ఆర్గానిక్స్ ఫుడ్స్ ను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.  దీనిని బేస్ చేసుకొని ఈ కథను అల్లాడు దర్శకుడు వెంకీ.  కథ విషయానికి వస్తే,దాదాపు ఎనిమిదివేల కోట్ల రూపాయల విలువచేసే భీష్మ ఆర్గానిక్ కంపెనీకి అనంత నాగ్ చైర్మన్ గా ఉంటాడు.  తన కంపెనీ విలువలు కాపాడేందుకు, కంపెనీని అన్ని రకాలుగా చూసుకోవడానికి కొత్త సీఈవోను ఏర్పాటు చేయాలని అనంత నాగ్ చూస్తుంటాడు.  దీనికోసం చాలామంది నుంచి పోటీ వస్తుంది.  కానీ, అనుకోని విధంగా కనీసం డిగ్రీకుడా పాస్ కానీ నితిన్ ను సెలక్ట్ చేస్తారు.  నెలరోజుల పాటు సీఈవోగా ఉండేందుకు ఒప్పందం కుదురుతుంది. అసలు నితిన్ కు అవకాశం ఎలా వచ్చింది.? రష్మిక ఎవరు ? ఆమెను ప్రేమలో ఎలా పడేశాడు? చివరికి ఏమైంది అన్నది మిగతా కథ.  

విశ్లేషణ: 

సేంద్రియ వ్యవసాయం నేపథ్యంలో సాగే కథ ఇది.  వ్యవసాయం బ్యాక్ డ్రాప్ తో చాలా సినిమాలు వచ్చాయి.  మెప్పించాయి.  అయితే, ఈ సినిమాను ఆ బ్యాక్ డ్రాప్ లో చూపించినా, ప్రేక్షకులకు నచ్చే హాస్యాన్ని జోడించారు.  అది సినిమాకు ప్లస్ అయ్యింది.  ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా కామెడీకి పెద్దపీట వేస్తూ కథనాలు రాసుకున్నారు.  అది బాగానే వర్కౌట్ అయ్యింది. ఎక్కడా పెద్దగా సీరియస్ గా స్టోరీ కనిపించదు.  మూవీ ఓపెనింగ్ సీన్స్ కు చాలా సింపుల్ గా ఉంటాయి.  ఇక నితిన్ వెన్నెల కిషోర్ కలిసిన తరువాత సినిమా కొంచం స్పీడ్ అందుకుంటుంది.  రష్మికను ప్రేమలో పడేసే సీన్స్ నవ్వించే విధంగా ఉంటాయి.  

ఫస్ట్ హాఫ్ ఎండింగ్ లో వచ్చే ట్విస్ట్ ప్లస్ అయ్యింది.  అయితే సెకండ్ హాఫ్ లో సినిమా సీరియస్ గా నడుస్తుంది అనుకున్నా అందులో కూడా కామెడీని మిక్స్ చేసి ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా నడిపించాడు.  విలన్ పాత్రలను కూడా కామెడీకోసం వినియోగించుకోవడం సినిమాకు మైనస్ పాయింట్ అని చెప్పాలి.  

నటీనటుల పనితీరు: 

నితిన్ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాడని చెప్పొచ్చు.  తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మెప్పించాడు.  ఇదే సినిమాకు ప్లస్ అయ్యింది.  ఇక రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  అందంగా కనిపిస్తూనే అభినయంతో ఆకట్టుకుంది.  వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, రఘుబాబులు పరిధిమేరకు హాస్యంతో మెప్పించారు.  

సాంకేతికవర్గం పనితీరు: 

ఛలో సినిమాతో తానేమిటో నిరూపించుకున్న వెంకీ కుడుముల రెండో సినిమాను కూడా అదే రేంజ్ తీర్చిద్దిడం విశేషం.  సినిమాకు కథ, కథనాలు, మాటలు ప్లస్ అయ్యాయి.  కొన్ని సీన్స్ లో త్రివిక్రమ్ స్టైల్ ను కనబరిచారు.  మహతి స్వర సాగర్ సంగీతం బలం అయ్యింది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకు కొంత బలం చేకూర్చింది.  

పాజిటివ్ పాయింట్స్: 

నటీనటులు 

కథ 

కథనాలు 

నెగెటివ్ పాయింట్స్: 

సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు 

చివరిగా: భీష్మ: సీరియస్ గా నవ్వించాడు