భారీ క్లైమాక్స్ షూట్ లో ఆర్‌ఆర్ఆర్

భారీ క్లైమాక్స్ షూట్ లో ఆర్‌ఆర్ఆర్

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో భారీ మల్టీస్టారర్ సినిమా 'ఆర్‌ఆర్ఆర్' చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ గురించి అప్‌డేట్స్ కోసం ప్రేక్ష‌కులు, అభిమానులు ఎదురు చూసీ చూసీ ఈ సినిమా‌పై సెటైర్లు కూడా వేస్తున్నారు. ‌అయితే తాజాగా ఆర్‌ఆర్ఆర్ నుంచి ఓ మంచి అప్డేట్ వచ్చింది. ఆర్‌ఆర్ఆర్ భారీ క్లైమాక్స్ షూట్ ప్రారంభమైందని చిత్ర యూనిట్ తెలిపింది. భీమ్, రామరాజు కలిసి వారు సాధించాలనుకున్నది నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపింది. ఈమేరకు ఇద్దరి చేతులను కలిపి ఉన్న ఫోటోను పోస్ట్ చేసారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. క్లైమాక్స్ షూట్ కావడంతో ఇదే చివరి షెడ్యూల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాగా ఈ నెల 26న రిపబ్లిక్‌ డే సందర్భంగా రాజమౌళి 'ఆర్‌ఆర్ఆర్' స్పెషల్‌ టీజర్‌ విడుదల చేసేందుకు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది.