కేటీఆర్ విశ్వనగరం అన్నారు..ఏమైంది?

కేటీఆర్ విశ్వనగరం అన్నారు..ఏమైంది?

టీఆర్ఎస్ ప్రభుత్వంపై  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రం వర్షాలకు వెనిస్ నగరంలా కనిపించిందని..కేసీఆర్ ఇస్తాంబుల్, డల్లాస్ చేస్తామన్నారని పేర్కొన్నారు భట్టి.  కేటీఆర్ విశ్వనగరం అన్నారు.  ఏమైంది?...72 వేల కోట్ల అభివృద్ధి ఎటు పోయిందని ప్రశ్నించారు. టిఆర్ఎస్ ను దూరం పెట్టి నగరాన్ని కాపాడుకోవాలని.. కల్వకుర్తి ప్రాజెక్టు పంపు హౌజ్ మునకకు గత ప్రభుత్వం కారణం అనడానికి సిగ్గుండాలన్నారు. పాలమూరు ప్రాజెక్టులో అండర్ గ్రౌండ్ పంప్ హౌజ్ నిర్మించొద్దని నిపుణుల కమిటీ చెప్పిందని..అండర్ గ్రౌండ్ బ్లాస్ట్ లతో కల్వకుర్తి కి నష్టం జరుగుతుందని చెప్పారని తెలిపారు. కేవలం కాంట్రాక్టర్లకు లబ్ది కోసం అండర్ గ్రౌండ్ పంప్ హౌజ్ నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. తన అనుకూలమైన ఈఎన్సీ కి ఎక్స్ట్రెంషన్ ఇచ్చి ఇర్రిగేషన్ శాఖను సర్వనాశనం చేశారని..ఈఎన్సీ మురళీధర్ రావు ఇచ్చిన అన్ని పనుల పై విచారణ జరిపించాలన్నారు. ప్రాజెక్టుల వద్దకు ప్రతిపక్షాలను ఎందుకు వెళ్లనీయడం లేదని..మేము తప్పకుండా వెళతాము, ఎలా ఆపుతారో చూస్తామని హెచ్చరించారు.