రివ్యూ: భారత్

రివ్యూ: భారత్

నటీనటులు: సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌, దిశా పటానీ, సునీల్‌ గ్రోవర్‌, టబు, జాకీ ష్రాఫ్‌ తదితరులు
సంగీతం: విశాల్‌, శేఖర్‌
సినిమాటోగ్రఫీ: మార్సిన్‌ లాస్కావీక్‌
నిర్మాణ సంస్థ: రీల్‌ లైఫ్‌ ప్రొడక్షన్స్‌, సల్మాన్‌ ఖాన్‌ ఫిలింస్‌, టీ సిరీస్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అలీ అబ్బాస్‌ జాఫర్‌  

ఈద్ వచ్చింది అంటే సల్మాన్ ఫ్యాన్స్ కు పండుగే.  ఎందుకంటే ఈద్ రోజున సల్మాన్ సినిమా తప్పకుండా రిలీజ్ అవుతుంది.  అందులో సందేహం లేదు. ఇందులో భాగంగానే ఈరోజు భారత్ సినిమా రిలీజ్ అయ్యింది.   సల్మాన్ తో పాటు కత్రినా కైఫ్, దిశా పటానిలు హీరోయిన్లు.  ఆలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.  

కథ: 

దేశం... దేశంతో పాటు ప్రజలు ప్రయాణం చేస్తూనే ఉండాలి.  ప్రయాణం చేయము ఆగిపోతాం అంటే కుదరదు.  ఇలా దేశంతో పాటు ప్రయాణం చేసిన వ్యక్తి సల్మాన్.  అతని ప్రయాణమే భారత్.  దేశానికి స్వాతంత్రం, దేశ విభజన, నిరుద్యోగం, ఎమర్జెన్సీ, ఆర్థికమాంద్యం ఇలా దేశంలో జరిగిన సంఘటనలను దాటుకుంటూ... ఎదురైనా ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగిన వ్యక్తి కథ ఈ భారత్.  సల్మాన్ చిన్నతనంలో తన తండ్రికి ఓ మాట ఇస్తాడు.  ఇచ్చిన మాట కోసమే జీవిస్తాడు.  సల్మాన్ తండ్రికి ఇచ్చిన మాట ఏంటి... సల్మాన్ తన లైఫ్ ను ఎలా నిలబెట్టుకున్నాడు.. సల్మాన్ జీవితంలోకి కత్రినా కైఫ్ ఎలా వచ్చింది.. అన్నది మిగతా కథ. 

విశ్లేషణ: 

కొరియాలో వచ్చిన ఓడ్ టు మై ఫాదర్ సినిమాకు భారత్ రీమేక్.  కొరియన్ సినిమా థీమ్ తీసుకోని దానికి భారతీయ రంగులు, హంగులు జోడించి తీసిన సినిమా ఇది.  దేశానికీ స్వాతంత్రం వచ్చిన తరువాత జరిగిన సంఘటనలను ఈ సినిమాలో చక్కగా చూపించారు.  సల్మాన్ 20 సంవత్సరాల యువకుడి దగ్గరి నుంచి 70 సంవత్సరాల వృద్ధుడి వరకు వివిధ గెటప్ లలో చక్కగా నటించారు.  హావభావాలలో వేరియేషన్స్ కనబరిచారు.  డైలాగ్స్ సింపుల్ గా షార్ప్ గా ఉన్నాయి.  70 ఏళ్ల జర్నీని రెండున్నర గంటల్లో చక్కగా చూపించారు.  

ఎవరెలా చేశారంటే :  

విభిన్నమైన గెటప్స్ లో సల్మాన్ అదరగొట్టాడు.  వయసుకు తగ్గట్టుగా హావభావాలు ఉన్నాయి.  చలాకీతనం కనిపించింది. కామెడీ టైమింగ్ బాగుంది.  సల్మాన్ వయసులో ఉండగా ఆయనకు ప్రేయసిగా చేసినా దిశా పటాని మెప్పించింది.  గ్లామర్ తో అదరగొట్టింది.  సల్మాన్, కత్రినాల మధ్య కెమిస్ట్రీ సూపర్బ్ గా వర్కౌట్ అయ్యింది.  

సాంకేతిక వర్గం పనితీరు: 

దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం అద్భుతం అని చెప్పాలి.  స్వాతంత్రం వచ్చినపుడు ఇండియా ఎలా ఉండేది... కాలంతో పాటు ఎలా మార్పులు చెందింది అనే విషయాలను తెరపై చూపించడంలో సఫలం అయ్యారు.  ఫొటోగ్రఫీ సినిమాలు ప్లస్ అయ్యింది.  విశాల్ శేఖర్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోశాయి.  

పాజిటివ్ పాయింట్స్: 

నటీనటులు 

కథ 

కథనాలు 

మ్యూజిక్ 

ఫొటోగ్రఫీ 

మైనస్ పాయింట్స్: 

అక్కడక్కడా లాజిక్ మిస్ 

చివరిగా : ఎమోషనల్ గా సాగిన ఓ బాధితుడి ప్రయాణం...