పాక్ తో మిగిలిన రెండు టెస్టులకు స్టోక్స్ దూరం...
స్టార్ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కుటుంబ కారణాల వల్ల పాకిస్థాన్‌తో జరిగే మిగిలిన టెస్ట్ మ్యాచ్‌లకు దూరం అవుతున్నాడు. స్టోక్స్ ఈ వారం తరువాత ఇంగ్లాండ్ నుండి బయలుదేరి న్యూజిలాండ్ కు వెళతాడు అని ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటన తెలిపింది. అందువల్ల ఆగస్టు 13 అలాగే ఆగస్టు 21 న లో పాకిస్థాన్‌తో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్‌లకు అతను దూరం అవుతున్నాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ వైస్ కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ బాధ్యతలు నిర్వర్తించాడు. తొలి టెస్టులో పాకిస్థాన్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించిన ఇంగ్లండ్ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వచ్చింది. అయితే స్టోక్స్ తల్లిదండ్రులు గెడ్, డెబ్ ఇప్పటికి అతను జన్మించిన న్యూజిలాండ్‌లో నివసిస్తున్నారు. స్టోక్స్ ఈ వారం తరువాత యుకె నుండి బయలుదేరి న్యూజిలాండ్ వెళ్లి తన కుటుంబాన్ని కలవనున్నారు. కరోనా విరామం తర్వాత ఇప్పటివరకు స్టోక్స్ మొత్తం నాలుగు టెస్టులు ఆడాడు, వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్ లోని మొదటి మ్యాచ్ లో జో రూట్ లేకపోవడంతో మొదటిసారిగా స్టోక్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)