బెల్లంకొండ బాలీవుడ్‌ను మెప్పిస్తాడా

బెల్లంకొండ బాలీవుడ్‌ను మెప్పిస్తాడా

ముంబై: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అంతగా సినిమాలు చేయకపోయిన అతి తక్కువ సినిమాలతోనే తెలుగు ప్రజలకు గుర్తుండిపోయాడు. అయితే ఇటీవల శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు చూస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అల్లుడు శ్రీను సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన శ్రీను తన తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. తరువాత వరుస సినిమాలు తీసి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. అతడి బాలీవుడ్ ఇంట్రీని నిజం చేస్తూ ఇటీవల ఓ వార్త వచ్చింది. అయితే రెబల్ స్టార్ ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. హిందీలో ఈ సినిమాను వివి వినాయక్ దర్శకత్వంతో పెన్ స్టూడియోస్ వారు నిర్మిస్తున్నారు. వివి వినాయక్‌కు మంచిమంచి కమర్షియల్ హిట్‌లు తీస్తాడన్న పేరుంది. ఇప్పుడు ఛత్రపతి రీమేక్‌లో శ్రీను ఒరిజినల్‌లోని ప్రభాస్ పాత్ర చేయనున్నారు. దీని గురించి హీరో మాట్లాడాడు. ‘బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇదే సరైన ప్రాజెక్ట్. పెన్ స్టూడియోస్, చైర్మన్ జయంతిలాల్ గద గారిని కలుసుకోవడం నా అదృష్టం. అంతేకాకుండా నా మొదటి సినిమాతోనే హిట్ అందించిన దర్శకుడు వివి వినాయక్ గారితో మరో సినిమా చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. దానికి తోడుగా ప్రభాస్ చేసిన పాత్ర చేయడం అంటే భారీ బాధ్యతలు మోయాల్సిందే, అయినా నాకు ఈ అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. స్ర్కిప్ట్ కూడా అద్భతంగా ఉంద’ని శ్రీనివాస్ అన్నాడు. వీవీ వినాయక్ పరిశ్రమలో దాదాపు హీరోలందరికీ కమర్షియల్ బ్లాక్ బాస్టర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఛత్రపతి రీమేక్ తీసేందుకు ఆయన ఒప్పుకున్నారు. దీని కోసం పెన్ స్టూడియోస్ చైర్మన్ జయంతీలాల్ గత ఈ సినిమాను తెరకెక్కెంచేందుకు ఓకే చెప్పారు. మరి బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ రాణిస్తాడా, అక్కడి వారు అతడిని ఆదరిస్తారా అన్నడి చూడాలి.