నాన్న మరణం, కరోనా.. చాలా క్లిష్టమైన పరిస్థితి: రాయ్ లక్ష్మి

నాన్న మరణం, కరోనా.. చాలా క్లిష్టమైన పరిస్థితి: రాయ్ లక్ష్మి

హీరోయిన్ రాయ్ లక్ష్మి తెలుగు, తమిళంలో నటించి బాలీవుడ్ లోను అవకాశాలు కొట్టేసింది. అయిన ఆమెను ప్రత్యేక గీతాల్లో చూపించేందుకే దర్శకులు మొగ్గుచూపుతున్నారు. కాగా, లక్ష్మి రాయ్ ఇటీవలే కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. గతేడాది తన తండ్రి క్యాన్సర్ కారణంగా మరణించారు. నాన్నను కోల్పోవడంతో తాను సర్వం కోల్పోయానని లక్ష్మి రాయ్ తెలిపింది. మానసికంగా కుంగిపోయిన సమయంలో కరోనా బారిన పడటం.. ఐసోలేషన్ లో ఉండటం తనను తీవ్రంగా కుంగదీసిందని పేర్కొంది. ఈ క్రమంలో చాలా క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొన్నానని, ఆ కష్టాలు తాను ఎప్పుడూ పడలేదని చాలా బాధగా వివరించింది. ప్రస్తుతం పలు సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ లలోను నటిస్తున్నానని లక్ష్మి రాయ్ తెలిపింది.