బేగంబజార్ వ్యాపారుల కీలక నిర్ణయం: సాయంత్రం 5 వరకే మార్కెట్... 

బేగంబజార్ వ్యాపారుల కీలక నిర్ణయం: సాయంత్రం 5 వరకే మార్కెట్... 

తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది.  రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి.  ఇటు హైదరాబాద్ నగరంలో కూడా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  హైదరాబాద్ లోని బేగంబజార్ నిత్యం రద్దీగా ఉంటుంది.  రోజు వేలాదిమంది కొనుగోలు దారులు రాష్ట్రం నలుమూలల నుంచి వస్తుంటారు.  బేగంబజార్ మార్కెట్లో 100 మంది వ్యాపారులకు కరోనా సోకింది.  మార్కెట్లో కరోనా వేగంగా వ్యాపిస్తుండటంతో మార్కెట్ పనివేళల్లో మార్పు చేసినట్టు మార్కెట్ అసోసియేషన్ పేర్కొన్నది.  ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే మార్కెట్ ఓపెన్ చేసి ఉంటుందని అసోసియేషన్ పేర్కొన్నది.  కరోనా కేసులు తగ్గేవరకూ ఈ నిబంధనలు అమలులో ఉంటాయని అసోసియేషన్ తెలియజేసింది.