యువతి కేసు : సెల్‌టవర్‌ ఎక్కిన యువకుడిపై తేనెటీగల దాడి

యువతి కేసు : సెల్‌టవర్‌ ఎక్కిన యువకుడిపై తేనెటీగల దాడి

ప్రేమించిన యువతితో తనపై తప్పుడు కేసు పెట్టించారని సెల్‌టవర్‌పై నిరసన వ్యక్తం చేస్తున్న యువకుడిపై అనూహ్యంగా తేనేటీగలు దాడి చేశాయి. సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయాడు యువకుడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగింది. ప్రేమించిన యువతితో తప్పుడు కేసు పెట్టించారని మనస్తాపం చెందిన రోహిత్‌ నిన్న స్థానిక ఎమ్మార్వో  ఆఫీస్‌ ఎదురుగా ఉన్న సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానన్నాడు.  మొన్న రాత్రి యువతి ఫిర్యాదుతో విచారణకు వెళ్ళిన రాంబాబు అనే కానిస్టేబుల్ పై రోహిత్ దాడి చేశాడు. దీంతో రోహిత్ పై మరో కేసు నమోదయింది. అయితే స్థానిక వైసీపీ నాయకుడి ప్రోద్బలంతోనే తన మీద తప్పుడు కేసు పెట్టారంటున్న రోహిత్ వర్షం వస్తున్నా రాత్రంతా టవర్ పైనే గడిపినట్టు తెలుస్తోంది.  అయితే రాత్రి నుంచి టవర్‌పైనే ఉన్న రోహిత్‌పై హఠాత్తుగా తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల దాడి నుంచి తప్పించుకోబోయి రోహిత్ సెల్‌టవర్‌ పైనుంచి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని ఇన్‌ఛార్జ్‌ సిఐ వాహనంలో ఏరియా ఆసుపత్రికి తరలించారు.