రివ్యూ: బ్యూటిఫుల్ 

రివ్యూ: బ్యూటిఫుల్ 

నటీనటులు: నైనా గంగూలీ, సూరి తదితరులు 

మ్యూజిక్: రవిశంకర్ 

సినిమాటోగ్రఫీ: అగస్త్య మంజు

నిర్మాతలు: టి నరేష్ కుమార్, టి.శ్రీధర్, రామ్ గోపాల్ వర్మ

దర్శకత్వం:  అగస్త్య మంజు

శివ సినిమాతో దర్శకుడిగా పరిచయమైనా వర్మ ఆ సినిమాతోనే సంచలనం సృష్టించాడు.  తెలుగు సినిమా ఇండస్ట్రీ దశ దిశలు మార్చారు.  ఆ సినిమాతో సంచలనం సృష్టించిన వర్మ ఆ తరువాత చాలా సంచలనాలు సృష్టించారు.  సంచలనాలు ఎలా సృష్టించాలో చెప్పిన వర్మ... సినిమాలు ఎలా తీయకూడదో కూడా వర్మ నుంచి తెలుసుకోవచ్చు. అప్పట్లో సంచలనం సృష్టించిన రంగీలా సినిమాకు ట్రిబ్యూట్ గా బ్యూటిఫుల్ అనే సినిమాను నిర్మించారు.  ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది.  మరి ఈ బ్యూటిఫుల్ ప్రేక్షకులను ఆకట్టుకుందా... తెలుసుకుందాం.  

కథ: 

అది ముంబై నగరంలోని ధారవి ప్రాంతం.  అక్కడి ప్రజల బ్రతుకు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.  రోజు పనిచేస్తేగాని రోజు గడవని పరిస్థితి.  ఉన్నంతలో తృప్తి చెందే వ్యక్తులు అక్కడ చాలా తక్కువ మంది ఉంటారు.  అలాంటి వాళ్లలో నైనా గంగూలీ ఒకరు.  ఇంకా ఏదో కావాలి.. ఏదో చేయాలి అనే భ్రమలో జీవించే వ్యక్తి హీరో సూరి.  వీరిద్దరికి పరిచయం ఏర్పడుతుంది.  ఇద్దరివి వ్యతిరేకమైన ఆలోచనలు.  ప్రేమకు ఇవేమి అడ్డంకులు కాదు కాబట్టి వీరి మధ్య ప్రేమ పుట్టింది.  ఆ ప్రేమ అలా సాగుతున్న సమయంలో అనుకోకుండా నైనాకు సినిమా ఛాన్స్ వస్తుంది.  ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదుగుతుంది.  అయినా సరే ప్రేమించిన వ్యక్తిని మర్చిపోదు.  అతనితోనే జీవితం అనుకుంటుంది.  కానీ, నైనా మేనేజర్ కారణంగా ఇద్దరి మధ్య విభేదాలు వస్తాయి.  విడిపోతారు.  అలా విడిపోయిన వ్యక్తులు తిరిగి కలిశారా ? లేదా అన్నది సినిమా కథ.  

విశ్లేషణ: 

ఆల్ హిట్ సినిమాలను చెడగొట్టడంలో, వాటికి చెడ్డపేరు తీసుకురావడంలో వర్మకు మించిన వ్యక్తులు మరొకరు ఉండరు.  వర్మకు బాగా నచ్చిన సినిమా షోలే అని ఆయనే ఎన్నోసార్లు చెప్పారు.  ఆ సినిమాకు సీక్వెల్ చేయడం కాగానే, ఆ సినిమాను రీమేక్ చేయడం కానీ చేయడం అంటే పులి నోట్లో తలపెట్టినట్టే, మంటల్లోకి దూకినట్టే.  ఈ విషయం వర్మకు బాగా తెలుసు.  తెలిసి కూడా అప్పట్లో ఆగ్ సినిమా తీసి చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు రంగీలాకు ట్రిబ్యూట్ అంటూ బ్యూటిఫుల్ సినిమా తీసి కాళ్ళు కాల్చుకున్నాడు.  వర్మ, అయన శిష్యుడు దర్శకుడు అగస్త్య మరో ఇద్దరు కలిసి ఈ కథను, కథనాలు తయారు చేశారట.  సినిమా చూసిన వాళ్లకు అసలు ఇందులో ఏముంది.. హీరోయిన్ ను  అంగాంగ ప్రదర్శన తప్పా అని అంటున్నారు.  

పాటల్లో హీరోయిన్ ను బ్యూటిఫుల్ గా చూపించారు.  కావాల్సిన దానికంటే మరింతగా అంగాంగ ప్రదర్శన ఉన్నది.  అంతకు మించి సినిమాలో ఏమి లేదు.  ఫస్ట్ హాఫ్ లో ఏం జరుగుతుందో తలగోక్కున్న ప్రేక్షకులు సెకండ్ హాఫ్ లో ఏదైనా ఉంటుందేమో అని ఆతృతగా ఎదురు చూస్తే... అక్కడ కూడా ఎదురు దెబ్బ తగులుతుంది.  రొటీన్ కథతో, చప్పని కథనాలతో సినిమాను బోర్ కొట్టించారు.  

నటీనటుల ప్రదర్శన: 

హీరోయిన్ నైనా గంగూలీ ఉన్నంతలో మెరుగ్గా నటించింది.  అందాలను కావాల్సిన విధంగా ఆరబోసింది.  సూరి పర్వలేనిపించారు.  మిగతా నటీనటుల పాత్రలు వచ్చిపోయే విధంగా ఉన్నాయి.  

సాంకేతికవర్గం పనితీరు: 

నలుగురు కలిసి తయారు చేసుకున్న కథ... కథనాలు.. ఇలా ఉంటాయా అనిపించే విధంగా సినిమాను తీశారు.  ఇది మాములు సినిమానా లేదంటే పెద్దల సినిమా తీసేందుకు ముందుగా ట్రయల్స్ చేస్తున్నారా అనే విధంగా  ఉన్నది.  వర్మ ఇప్పటికే జీఎస్టీ సినిమా తీశాడు.  శిష్యుడి చేత కూడా అదే టైపులో సినిమా తీయించేందుకు ఈ సినిమాను ట్రయల్స్ గా ఉపయోగించుకుంటున్నారేమో అనిపిస్తోంది.  రవిశంకర్ మ్యూజిక్ బాగుంది.  సిరాశ్రీ లిరిక్స్ బాగున్నాయి.  అగస్త్య కెమెరా పణీతం సోసో గా ఉన్నది.  

పాజిటివ్ పాయింట్స్: 

నైనా గంగూలీ నటన 

రవిశంకర్ మ్యూజిక్ 

నెగెటివ్ పాయింట్స్: 

కథ 

కథనాలు 

ఇంకా చాలా ఉన్నాయి. 

చివరిగా: బ్యూటిఫుల్: వాళ్లకు మాత్రమే స్పెషల్