అయోధ్యలో అద్భుతం : సీతారాముల కాళ్ళు మొక్కిన వానరం

అయోధ్యలో అద్భుతం  : సీతారాముల కాళ్ళు మొక్కిన వానరం

అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఈరోజు భూమి పూజ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో అయోధ్యలో అద్భుత దృశ్యం వెలుగు చూసింది. అయోధ్యలో ఈ భూమి పూజ జరుగుతున్న చోట చాలా స్టాల్స్ ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసిన ఓ చోట సీతారాముల విగ్రహాలు ఉండగా అక్కడికి వచ్చిన వానరం సీతారాముల కాళ్ళు మొక్కిన వైనం కెమెరా కంటికి చిక్కింది. నిజానికి మన భారత దేశంలో వానరాన్ని హనుమంతుడిగా ఆయన ప్రతినిధిగా భావిస్తారు. మోడీ ఈరోజు అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేయనున్న నేపధ్యంలో ఈ ఘటన జరగడంతో ఈ కార్యానికి ఆంజనేయుని ఆశీసులు లభించాయని సంబర పడుతున్నారు భక్తులు.