ఐపీఎల్ ఆతిధ్యానికి బీసీసీఐ నుండి మాకు అనుమతి వచ్చింది...

ఐపీఎల్ ఆతిధ్యానికి బీసీసీఐ నుండి మాకు అనుమతి వచ్చింది...

ఐసీసీ టీ 20 ప్రపంచకప్ వాయిదా పడడంతో యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు ఐపీఎల్ 2020 జరగనుంది అని గత వారం జరిగిన ఐపీఎల్ పాలకమండలి సమావేశం లో నిర్ణయించారు. భారత లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఐపీఎల్ 2020 ని బీసీసీఐ యూఏఈ లో నిర్వహిస్తుంది. అయితే ఈ విషయం పై భారత్ లో గత పదిరోజుల నుండి చర్చ నడుస్తూనే ఉంది. ఇక తాజాగా ఈ విషయం పై స్పందించిన యూఏఈ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మాత్రం ఐపీఎల్ ఆతిథ్యం పై తమకు బీసీసీఐ నుండి మంగళవారం అధికారిక ధ్రువపత్రం వచ్చినట్లు స్పష్టం చేసింది. ఈ ఈవెంట్ నిర్వహించడానికి తాము సిద్దంగా ఉన్నట్లు కూడా ప్రకటించింది. ఐపీఎల్ 13 వ సీజన్ కు ఆతిథ్యం ఇవ్వడం యూఏఈకి ఎంతో విశేషమని క్యాబినెట్ సభ్యుడు, ఈసీబీ ఛైర్మన్ షేక్ నహయాన్ మబారక్ అల్ నహయాన్ అన్నారు. ఇక ఐపీఎల్ 2020 యూఏఈలోని 'దుబాయ్, షార్జా మరియు అబుదాబి' మూడు వేదికలలో మాత్రమే జరుగుతుంది. 51 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 60 మ్యాచ్ లు ఉంటాయి. అందులో 10 డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగుతాయి.