భారత ఆటగాళ్లకు శిక్షణా శిబిరాలు లేవు: బీసీసీఐ

భారత ఆటగాళ్లకు శిక్షణా శిబిరాలు లేవు: బీసీసీఐ

లాక్ ‌డౌన్ యొక్క నాలుగోవ దశలో ఆంక్షలు సడలించినట్లయితే మే 18 తర్వాత అగ్రశ్రేణి క్రికెటర్లు బహిరంగ శిక్షణను ప్రారంభించవచ్చని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ తెలిపాడు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా, అగ్రశ్రేణి అథ్లెట్లందరూ తమ ఇళ్లకు మాత్రమే పరిమితం అయ్యారు మరియు కరోనా లాక్ డౌన్ లో  తమను తాము ఫిట్ గా ఉంచుకోవడానికి కొన్ని వ్యాయామాలు చేస్తున్నారు. అయితే 18 న కేంద్ర ప్రభుత్వ  నుండి అనుకూలమైన మార్గదర్శకాలు ఉంటే మా ఆటగాళ్ళు వారి  బహిరంగ శిక్షణను ప్రారంభించవచ్చు అని ధుమల్ చెప్పారు. అయితే మా ఆటగాళ్ల ఆరోగ్యం మరియు భద్రత చాలా ముఖ్యమైనది. అందువల్ల ప్రయాణ ఆంక్షలు అమలయ్యే వరకు మాకు శిబిరాలు ఉండవు" కాబట్టి, వారు తమ నివాసాలకు సమీపంలో ఉన్న మైదానంలో శిక్షణా  ప్రారంభించగలరో లేదో తెలుసుకోవడానికి మేము  చూస్తున్నాము అని తెలిపారు. కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆటగాళ్లను అడుగుతారా అని అడిగిన ప్రశ్నకు... "మా ఆటగాళ్లందరూ మొదటి రోజు నుండే ఇంట్లో ఉన్నారు, సామాజిక దూర నిబంధనలను పాటిస్తున్నారు, వారు శిబిరాల్లో లేరు అందుకే వారికి  ఆ అవసరం లేదు అని  అరుణ్ ధుమాల్ తెలిపాడు.