మహిళల ఐపీఎల్ కూడా జరుగుతుంది : గంగూలీ 

మహిళల ఐపీఎల్ కూడా జరుగుతుంది : గంగూలీ 

భారతదేశంలో కరోనా కేసుల పెరుగుతున్న కారణంగా యూఏఈలో పురుషుల ఐపీఎల్ సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 8 వరకు జరుగుతుంది.  అయితే ఈ సమయం మహిళల ఐపీఎల్ కూడా సరిపోతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. ఈ  మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూ లో దాదా మాట్లాడుతూ... "మహిళల ఐపీఎల్ ఖచ్చితంగా జరుగుతుంది మరియు మహిళల క్రికెట్ కు బీసీసీఐ చాలా ప్రాధాన్యతనిస్తుంది. ఇప్పుడున్న మూడు జట్లతో మరో జట్టును చేర్చి మొత్తం 4 జట్లతో వారి ఐపీఎల్ నిర్వహిస్తాం అని తెలిపాడు. అయితే ఈ ఐపీఎల్ పురుషుల ఐపీఎల్ చివరి దశలో అంటే నవంబర్ 1-10 మధ్య నిర్వహించాలని చూస్తున్నాము. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత మహిళా క్రీడాకారుల కోసం ఒక శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తాము. అందులో వారు టోర్నమెంట్‌కు సిద్ధంగా ఉన్నారా.. లేదా అనేది నిర్ధారించుకుంటాము" అని గంగూలీ వివరించాడు.