టీ20 సిరీస్‌కు ప్రేక్షకులను అనుమతించే అవకాశం...

టీ20 సిరీస్‌కు ప్రేక్షకులను అనుమతించే అవకాశం...

వచ్చే నెల ఐదో తేదీ నుంచి భారత్‌లో జరిగే ఇంగ్లండ్‌ పర్యటన బీసీసీఐకి అగ్నిపరీక్ష కానుంది. క్రికెట్‌ ఆటను దగ్గరనుంచి చూడ్డానికి ఎదురుచూస్తున్న అభిమానులు.. హోం సిరీస్‌ కోసం ఎన్నాళ్లుగానో వెయిట్‌ చేస్తున్నారు. హోం సిరీస్‌కు ప్రేక్షకులను అనుమతించడంపై బీసీసీఐ ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఇంగ్లండ్‌తో మార్చి నెల రెండో వారం నుంచి జరిగే టీ 20 సిరీస్ నుంచి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించడంపై బీసీసీఐ కసరత్తు చేస్తోంది. టీ20 సిరీస్ మొదటి మ్యాచ్ మార్చి 12 న అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియంలో జరుగనున్నది. అభిమానులను స్టేడియంలోకి అనుమతించే విషయం ప్రభుత్వ నిర్ణయం మేరకు ఉంటుందని బీసీసీఐ అధికారులు చెప్తున్నారు.