ఐసీసీ-బీసీసీఐ మధ్య వార్

ఐసీసీ-బీసీసీఐ మధ్య వార్

ఐసీసీ-బీసీసీఐ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వేలం విధానంలో టోర్నమెంట్లు కేటాయించాలని ఐసీసీ నిర్ణయించడంతో.. బీసీసీఐ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. అలాంటిదేం కుదరదని తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని ఐసీసీ సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తేల్చిచెప్పినట్లుగా సమాచారం. భారత్‌లాగానే వేలం విధానంపై అటు ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డులు కూడా ఐసీసీపై గుర్రుగా ఉన్నాయి. 2023 నుంచి 2031 వరకు జరిగే వరల్డ్‌ కప్‌ టోర్నమెంట్లతోపాటు అన్నిరకాల టోర్నమెంట్లను వేలం విధానంలో కేటాయించాలని ఐసీసీ ఒక తీర్మానాన్ని తీసుకొచ్చింది.