బీసీసీఐకి తలనొప్పిగా మారిన ఆసీస్ టూర్...

బీసీసీఐకి తలనొప్పిగా మారిన ఆసీస్ టూర్...

ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటన పై బీసీసీఐ ఆలోచనలో పడింది. అన్ని అనుకున్న విధంగా జరిగితే 3 టీ 20లు, 3 వన్డేలు, 4 టెస్ట్ ల సిరీస్ కోసం భారత జట్టు నవంబర్ లో ఆసీస్ పర్యటనకు వెళ్ళాలి. అయితే ఆటగాళ్ల ఆసీస్ పర్యటనకు ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. ఈ స్వల్ప సమయంలో క్రికెటర్లతో పాటుగా సహాయక సిబ్బందికి వసతి, జట్ల ఎంపిక, ప్రాక్టీస్ సెషన్ నిర్వహణ ఇలా ప్రతి విషయంలోనూ బీసీసీఐ ముందు అనేక సవాళ్లు నిలిచాయి. మరో వైపు ఆసీస్ లో కూడా కరోనా నిబంధనలు ప్రతి రాష్ట్రానికి కూడా వేర్వేరుగా ఉండటంతో ఆసీస్ బోర్డు కూడా తల పట్టుకుంటుంది. అక్కడ కొన్ని రాష్ట్రలో 14 రోజుల క్వారంటైన్ నిబంధనలు ఉంటె మరి కొన్ని రాష్ట్రలో 7 రోజులు మాత్రమే ఉంది. ఇక షెడ్యూల్ ప్రకారం 4 టెస్ట్ మ్యాచ్ లు వేర్వేరు వేదికల్లో ఉండటంతో ఆటగాళ్లను ఎన్ని రోజుల క్వారంటైన్ లో ఉంచాలి అనే విషయంలో ఆసీస్ బోర్డు కూడా అయోమయంలో ఉంది. మరి ఈ విషయంలో ఆసీస్ బోర్డు ఒక స్పష్టత ఇచ్చే వరకు బీసీసీఐ వేచి చూడాల్సిందే..