ఐపీఎల్ 2020 స్పాన్సర్‌షిప్ కోసం టెండర్స్ ను ఆహ్వానించిన బీసీసీఐ...

ఐపీఎల్ 2020 స్పాన్సర్‌షిప్ కోసం టెండర్స్ ను ఆహ్వానించిన బీసీసీఐ...

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నమెంట్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం వేలం వేయాలని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బీసీసీఐ) నిన్న కంపెనీలను ఆహ్వానించింది. ఐపీఎల్ సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు యూఏఈ లో షార్జా, అబుదాబి మరియు దుబాయ్ మూడు వేడుకలోనే జరుగుతుంది. ఐపీఎల్ స్పాన్సర్‌లుగా మారడానికి చాలా కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు. భారతీయ సంస్థ అయిన లేదా మరెక్కడైనా, ఎవరు ఎక్కువ వేలం వేస్తే వారే హక్కులు పొందుతారు. ఆగస్టు నాటికి మేము మొత్తం ప్రక్రియను ఖరారు చేస్తాము పటేల్ అన్నారు. అయితే రూ .300 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న కంపెనీలను మాత్రమే ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం వేలం వేయడానికి అనుమతిస్తామని జే షా బీసీసీఐ పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌ హక్కులను వివో కోల్పోయింది.  ఈ సంస్థ 5 సంవత్సరాలకు గాను ఏడాదికి సుమారు 440 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇప్పుడు స్పాన్సర్ రేసులో బాబా రామ్‌దేవ్ యొక్క పతంజలి అలాగే అమెజాన్, బైజూస్ ముందు వరసలో ఉన్నాయి.