ఆటగాళ్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు...

ఆటగాళ్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు...

దేశవాళీ టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో ఆడుతున్న పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌ ఆటగాళ్లు మార్చి 1న అహ్మదాబాద్‌లో రిపోర్ట్‌ చేయాలని కోరింది బీసీసీఐ. ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ ల టీ 20 సిరీస్‌ అహ్మదాబాద్‌ వేదికగా జరగుతోంది. మార్చి 12 నుంచి అహ్మదాబాద్‌ వేదికగా ప్రారంభమయ్యే టీ 20 సిరీస్‌కు  శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ తెవాటియా, భువనేశ్వర్ కుమార్ ఎంపికయ్యారు. విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్న క్రికెటర్లు ప్రస్తుతం ఐదు నగరాల్లో ఏర్పాటు చేసిన బయో బబుల్స్‌లో ఉన్నారు. మొతేరా స్టేడియంలో మార్చి 12 నుంచి 20 వరకు టీ20 సిరీస్‌ జరగనుంది. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ పుణె వేదికగా మార్చి 23 నుంచి 28 మధ్య జరగనుంది.