చివరి రెండు టెస్టులకు జట్టును ప్రకటించిన బీసీసీఐ...

చివరి రెండు టెస్టులకు జట్టును ప్రకటించిన బీసీసీఐ...

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకున్న భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ తో స్వదేశంలో నాలుగు టెస్టుల సిరీస్ ఆడుతుంది. అయితే ఈ సిరీస్ ప్రారంభం కంటే ముందు మొదటి రెండు టెస్టులకు జట్టును ప్రకటించిన బీసీసీఐ ఇప్పుడు తాజాగా చివరి రెండు టెస్టులకు 17 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే ఆసీస్ సిరీస్ లో గాయపడిన ఉమేష్ యాదవ్ ఇంగ్లాండ్ తో మొదటి రెండు టెస్టులకు దూరంగా ఉండగా చివరి రెండు టెస్టులకు జట్టులో స్థానం దకించుకున్నాడు. అలాగే శార్దుల్ ఠాకూర్ ను విజయ్ హజారే టోర్నీ కోసం బీసీసీఐ విడుదల చేసింది.

టీం ఇండియా : విరాట్ కోహ్లీ (c), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుబ్‌మాన్‌ గిల్, చేతేశ్వర్ పూజారా, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, వృద్దిమాన్ సాహా, అశ్విన్, కుల్దీప్ పదవ్, వాషింగ్టన్ సుందర్, ఇశాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, సిరాజ్.