ప్లే ఆఫ్, ఫైనల్స్ కు వేదికలను ఖరారు చేసిన ఐపీఎల్...

ప్లే ఆఫ్, ఫైనల్స్ కు వేదికలను ఖరారు చేసిన ఐపీఎల్...

మార్చి లో జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 కరోనా కారణంగా వాయిదా పడి ప్రస్తుతం యూఏఈ వేదిక జరుగుతుంది. సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు ఈ లీగ్ జరుగుతుంది అని ముందే ప్రకటించింది బీసీసీఐ. అయితే ఈ వైరస్ కారణంగానే యూఏఈ లో కూడా కేవలం దుబాయ్, అబుదాబి, షార్జా ఈ మూడు వేదికలో మాత్రమే మ్యాచ్ లను నిర్వహిస్తున్నారు. కానీ ప్లే ఆఫ్ మ్యాచ్ లు అలాగే ఫైనల్ మ్యాచ్ ఎక్కడ నిర్వహిస్తారు అనేది తాజాగా ఐపీఎల్ యాజమాన్యం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.

అయితే పురుషుల ఐపీఎల్ 2020 చివర్లో అంటే నవంబర్ 4 నుండి 9 వరకు మహిళల ఐపీఎల్ నిర్వహించనున్నట్లు ఈ మధ్యే బీసీసీఐ ప్రకటించింది. ఇక తాజాగా ఈ లీగ్ కోసం మహిళా ప్లేయర్స్ యూఏఈ కి కూడా వెళ్లారు. వీరి లీగ్ లో కేవలం మూడు జట్లతో 4 మ్యాచ్ లు మాత్రమే జరుగుతాయి. అందువల్ల వీరిని పురుషుల జట్ల మాదిరిగా వివిధ వేదికలకు తిప్పకుండా కేవలం షార్జాలోనే మహిళల ఐపీఎల్ మ్యాచ్ లను జరిపించడానికి సిద్ధమైంది బీసీసీఐ. ఆ వేదికలోనే జరిపించడానికి ముఖ్య కారణం ఏంటంటే... పురుషుల ఐపీఎల్ జరుగుతున్న ఈ మూడు వేదికలో షార్జాలోనే గ్రౌండ్ అన్నిటికంటే చిన్నది. అందుకే మహిళల ఐపీఎల్ అక్కడ నిర్వహిస్తున్నారు.  అయితే షార్జాలో ఈ మ్యాచ్ లు ఉంటాయి కాబట్టి పురుషుల ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్లు నవంబర్ 5 నుండి అబుదాబి వేదికగా అలాగే ఫైనల్ మ్యాచ్ నవంబర్ 10న దుబాయ్ వేదికగా నిర్వహిస్తున్నట్లు ఐపీఎల్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.