ఆసీస్ టూర్ కు భారత జట్టు సెలక్ట్... గాయం కారణంగా రోహిత్ దూరం..

ఆసీస్ టూర్ కు భారత జట్టు సెలక్ట్... గాయం కారణంగా రోహిత్ దూరం..

ఈ ఏడాది యూఏఈ లో జరుగుతున్న ఐపీఎల్ 2020 ముగిసిన తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్ 3 న ప్రారంభం కానున్న ఈ పర్యటనలో భారత జట్టు మూడు టీ 20, మూడు వన్డే, నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. ఇందుకోసం తాజాగా బీసీసీఐ జట్లను ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ జట్లను సెలక్ట్ చేసినట్లు బీసీసీఐ తెలిపింది. 

అయితే ఈ పర్యటనకు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరం అయ్యాడు. దాంతో అతని స్థానం లో శుబ్మాన్ గిల్ జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్ లో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ గాయపడ్డాడు. అందువల్ల ఈ మ్యాచ్ తర్వాత జరిగిన రెండు మ్యాచ్ లలో కూడా రోహిత్ ఆడలేదు. అలాగే ఐపీఎల్ లో విఫలమవుతున్న రిషబ్ పంత్ ను కేవలం టెస్ట్ జట్టుకు మాత్రమే పరిమితం చేసింది బీసీసీఐ. అందువల్ల వన్డే, టీ20 ల్లో కేఎల్ కీపింగ్ బాధ్యతలు అలాగే రోహిత్ స్థానంలో వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఇక టీ 20లో కీపర్ గా రాహుల్ తో పాటుగా ఐపీఎల్ లో రాణిస్తున్న సంజు సామ్సన్ ను ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే టెస్ట్ జట్టులోకి మహ్మద్ సిరాజ్ ను ఎంపికచేయడం అలాగే టీ 20 జట్టులో కుల్దీప్ యాదవ్ ను కాకుండా వరుణ్ చక్రవర్తిని తీసుకోవడం ఎవరు ఊహించని విషయం అనే చెప్పాలి. అయితే బీసీసీఐ ఆసీస్ టూర్ కు ఎంపిక చేసిన భారత జట్లు ఇవే...

టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లీ (c), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, చేతేశ్వర్, అజింక్య రహానే (vc), హనుమా విహారీ, శుబ్మాన్ గిల్, సాహా (w), రిషబ్ పంత్ (w), బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, నవదీప్ సైని, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్, మహ్మద్ సిరాజ్

వన్డే జట్టు : విరాట్ కోహ్లీ (c), శిఖర్ ధావన్, శుబ్మాన్ గిల్, కేఎల్ రాహుల్ (vc& w), శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైని, శార్దుల్ ఠాకూర్

టీ20 జట్టు : విరాట్ కోహ్లీ (c), శిఖర్, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ (vc&w), శ్రేయాస్ అయ్యర్, మనీష్, హార్దిక్ పాండ్యా, సంజు సామ్సన్ (w), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైని, దీపక్ చాహర్, వరుణ్ చక్రవర్తి