అక్టోబర్‌లో రాజమండ్రిలో బీసీ గర్జన

అక్టోబర్‌లో రాజమండ్రిలో బీసీ గర్జన

అక్టోబర్ నెలాఖరున రాజమండ్రి లో అతిపెద్ద బీసీ గర్జన బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు తెలుగుదేశం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావ్... తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన... రాజమండ్రి లాలాచెరువు ప్రాంతంలో జాతీయ రహదారి అనుకుని బీసీ గర్జన సభకు ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. ఇక బీజేపీ గురించి చూడాలన్నా, ఆలోచించాలన్నా... కేంద్రంలోనే తప్ప ఏపీలో ఎక్కడా వారి ఉనికి ఉండదని జోస్యం చెప్పిన కళా వెంకట్రావ్... రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీని రాష్ట్ర ప్రజలు ఏ విధంగా నమ్మాలని ప్రశ్నించారు. బీజేపీకి ఓట్లు వేస్తే అది వృథా ప్రయాసే అవుతుందన్నారు.