రివ్యూ: బాట్లా హౌస్  

రివ్యూ: బాట్లా హౌస్  

నటీనటులు: జాన్‌ అబ్రహాం, మృణాల్‌ ఠాకూర్‌, నోరా ఫతేహీ, రవి కిషన్‌, సోనమ్‌ అరోరా తదితరులు.  

సినిమాటోగ్రఫీ : సౌమిక్ ముఖర్జీ 

నిర్మాణ సంస్థ: టి సీరీస్, ఎమ్మా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, జాన్‌ అబ్రహం ఎంటర్‌టైన్‌మెంట్స్‌

దర్శకుడు: నిఖిల్ అడ్వాణీ 

ఢిల్లీలో బాట్లా హౌస్ అంటే అందరికి తెలుసు.  సెప్టెంబర్ 18, 2008న భారీ ఎన్ కౌంటర్ జరిగింది.  ఈ కాల్పుల్లో ఒక పోలీస్ అధికారితో పాటు ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.  ఆపరేషన్ బాట్లా హౌస్ సమయంలో అక్కడే స్థానికంగా ఉన్న కొంతమంది స్థానికులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని నిరసనలు వెల్లువెత్తాయి.  ఈ నేపధ్యాన్ని ఇతి వృత్తంగా తీసుకొని సినిమాను తెరకెక్కించారు.  జాన్  అబ్రహాం నటించిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది.  మరి ఈ మూవీ ఎలా ఉన్నదో ఇప్పుడు చూద్దాం. 

కథ: 

ఏసీపీ జాన్ అబ్రహాం తన బృందంతో కలిసి ఢిల్లీలోని బాట్లా హౌస్ లో ఓ ఎన్ కౌంటర్లో పాల్గొంటాడు.  ఈ ఎన్ కౌంటర్లో ఒక పోలీస్ అధికారితో పాటు ఇద్దరు ఉగ్రవాదులు మరణిస్తారు.  మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు.  అయితే, అదే సమయంలో మరో ఇద్దరు తప్పించుకొని పారిపోతారు.  ఈ ఎన్ కౌంటర్ను కొందరు రాజకీయ నాయకులు బూటకపు ఎన్ కౌంటర్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు.  దీనిపై పెద్ద ఎత్తున్న ఆందోళన చేస్తారు.  దీనికి కౌంటర్ గా ఆ ఆపరేషన్ కు నాయకత్వం వహించిన ఏసిపి జాన్ అబ్రహాం ఎలా సమాధానం ఇచ్చాడు.. దాన్ని ఎలా నిరూపించాడు అన్నది మిగతా కథ.  

విశ్లేషణ: 

సెప్టెంబర్ 13, 2008 అంటే ఢిల్లీ భయపడుతుంది.  ఆరోజున ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో వరస బాంబుదాడులు జరిగాయి.  ఆ దాడుల్లో దాదాపుగా 26 మంది మృతి చెందగా, చాలా మంది గాయపడ్డారు. ఈ దాడులకు ప్రతీకారంగా పోలీసులు నగరంలోని జామియా నగరంలోని బాట్లా హౌస్ పై పోలీసులు దాడి చేసి ఇద్దరు ఉగ్రవాదుల్ని హతమారుస్తారు.  ఇది రియల్ స్టోరీ.  ఈ స్టోరీతో తెరకెక్కిన సినిమా బాట్లా హౌస్.  ఏసీపీ అధికారిగా జాన్ అబ్రహాం చక్కగా నటించాడు.  దేశభక్తి కలిగినవ్యక్తిగా కనిపించాడు.  ఫస్ట్ హాఫ్ లో కథ చాలా వేగంగా, థ్రిల్లింగ్ గా సాగుతుంది.  నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే ఉత్కంఠతను రేకెత్తించాడు.  సెకండ్ హాఫ్ వరకు వచ్చే సరికి ఆ వేగం తగ్గింది.  పోలీసులపై వచ్చిన బూటకపు ఎన్ కౌంటర్ అపవాదును పోగొట్టడానికి కేసును పరిష్కరించే సన్నివేశాలతో నిండిపోయింది.  కేసులు, కోర్టులతోనే సెకండ్ హాఫ్ నడుస్తుంది.  సెకండ్ హాఫ్ లో వచ్చే డైలాగ్స్ చాలా బాగున్నాయి.  సినిమా మొత్తం దాదాపుగా సీరియస్ గా సాగుతుంది.  

నటీనటుల పనితీరు: 

జాన్ అబ్రహాం తన నటనతో మరోమారు ఆకట్టుకున్నారు.  నిబద్దత కలిగిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించాడు.  కెరీర్లోనే అత్యుత్తమ నటనను కనబరిచాడు.  జాన్ అబ్రహాం భార్య పాత్రలో నటించిన మృణాల్ ఠాకూర్ మెప్పించింది.  మిగతా నటీనటులు వారి పరిధిమేరకు నటించారు.  

సాంకేతికవర్గం పనితీరు: 

జరిగిన కథే కాబట్టి కథను సినిమాటిక్ గా మార్చి దానిని తెరపై చూపించడంలో సఫలం అయ్యాడు దర్శకుడు నిఖిల్ అద్వానీ.  థ్రిల్లింగ్ గా నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. జాన్ స్టీవర్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది.  టి సిరీస్ సంస్థ నిర్మాణ విలువలు బాగున్నాయి.  

పాజిటివ్ పాయింట్స్: 

కథ 

కథనాలు 

నటీనటులు 

యాక్షన్ 

డైలాగులు 

మైనస్ పాయింట్స్: 

నెమ్మదించిన సెకండ్ హాఫ్ 

చివరిగా: బాట్లా హౌస్ - ఉత్కంఠతను కల్గించింది.