ఇకపై ఆ బ్యాంకులు మూడు గంటలే పనిచేస్తాయి...!!

ఇకపై ఆ బ్యాంకులు మూడు గంటలే పనిచేస్తాయి...!!

కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న సమయంలో బ్యాంకింగ్ రంగ సేవలను 8 గంటలపాటు అందించడం కష్టం అవుతుంది.  అలాగని, పూర్తిగా లాక్ డౌన్ చేయడం కూడా కుదరని పని.  ప్రజలు ఇంట్లోనే ఉన్నప్పటికీ వారి అవసరాలు తీర్చాలి అంటే డబ్బు అవసరం ఉంటుంది.  డబ్బు బదిలీ జరగాలి, అందుకోసం బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండాలి. 

 బ్యాంక్ ఉద్యోగస్తులకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు.  రోజు 8 గంటలపాటు కాకుండా ఇకపై బ్యాంకులు రోజుకు మూడు నుంచి నాలుగు గంటలపాటు మాత్రమే పనిచేయబోతున్నాయి.  ఉదయం 7  గంటల నుంచి 10 గంటలవరకు, ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు లేదా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు పనిచేస్తాయి.  అత్యవసరమైతే తప్పించి బ్యాంకులకు రావొద్దని, ప్రజల కోసం మొబైల్ ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.