డిసెంబర్ నెలలో బ్యాంకులు ఎన్నిరోజు పనిచేయవంటే...
ప్రతి ఒక్కరికి బ్యాంకులతో పని ఉంటుంది. బ్యాంకులు ఓపెన్ చేసి ఉన్నప్పుడే పనులు పూర్తి చేసుకోవాలి. బ్యాంకులు ఎప్పుడు తెరిచి ఉంటాయి, ఏఏ రోజులు సెలవులు ఉంటాయి అనే విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇక డిసెంబర్ నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం. డిసెంబర్ 1 వ తేదీన జీహెచ్ఎంసి పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న బ్యాంకులకు డిసెంబర్ 1 వ తేదీన సెలవు ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో బ్యాంకులు తెరిచి ఉంటాయి. ఇక డిసెంబర్ 6, డిసెంబర్ 13, డిసెంబర్ 20, డిసెంబర్ 27 ఆదివారాలు కాబట్టి నాలుగు రోజులు సెలవులు ఉంటాయి. అదే విధంగా డిసెంబర్ 12, డిసెంబర్ 26 వ తేదీలు రెండు, నాలుగో శనివారాలు కాబట్టి బ్యాంకులు పనిచేయవు. అలానే డిసెంబర్ 25 క్రిస్మస్ కాబట్టి ఆరోజు సెలవు ఉంటుంది. డిసెంబర్ 25 నుంచి డిసెంబర్ 27 వరకు మూడు రోజులపాటు బ్యాంకులు పనిచేయవు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)