బంగ్లా క్రికెటర్ కు కరోనా పాజిటివ్... 

 బంగ్లా క్రికెటర్ కు కరోనా పాజిటివ్... 

ఐదు వన్డేల్లో బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మోషరఫ్ హుస్సేన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే గత ఏడాది అతనికి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ మధ్యే దానికి సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ సమయంలోనే తరచు ఆసుపత్రికి వచ్చి వెళ్తున్న అతని తండ్రి కరోనా బారిన పడ్డాడు. దాంతో హుస్సేన్ కూడా కరోనా భాధితుడయ్యాడు. ఈ విషయం పై మోషరఫ్ మాట్లాడుతూ...  ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. నాకు కరోనా పాజిటివ్ వచ్చిన వెంటనే నా ఇంట్లోనే స్వీయ నిర్బంధం లోకి వెళ్ళాను. కానీ నా తండ్రి మాత్రం సిఎంఎచ్ ఆసుపత్రి లో చేరాడు. ఇక నా భార్య, బిడ్డ ఇద్దరికి కరోనా నెగెటివ్ రావడంతో వారు మా అత్తమామల దగ్గర ఉంటున్నారు అని తెలిపాడు. ఇంతకముందు బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మష్రాఫ్ మోర్తాజా, నజ్ముల్ ఇస్లాం, నఫీస్ ఇక్బాల్ జూన్ లో కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.