వైరల్ అవుతున్న క్రికెటర్ వెడ్డింగ్ ఫోటోషూట్.. ఎందుకంటే..?

వైరల్ అవుతున్న క్రికెటర్ వెడ్డింగ్ ఫోటోషూట్.. ఎందుకంటే..?

ఈ రోజుల్లో, పెళ్ళికి ముందు వెడ్డింగ్ ఫోటోషూట్ అనేది ప్రతి ఒకరు చేస్తున్నారు. కాబోయే భార్యాభర్తలు ఇద్దరు తమకు నచ్చిన ప్రదేశాల్లో రకరకాల కాస్ట్యూమ్స్ లో ఫోటోలు దిగ్గుతారు. అలానే ఓ మహిళా క్రికెటర్ కూడా చేసింది. కానీ ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బంగ్లాదేశ్ జాతీయ మహిళా జట్టు క్రికెటర్ ''సంజిదా ఇస్లాం'' తన పెళ్ళికి ముందు ఫోటోషూట్ చేసింది. ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయిన ''మిమ్ మొసాద్ ‌డీక్‌''ను వివాహం చేసుకుంటున్న ఈ 24 ఏళ్ల మహిళా క్రికెటర్... మొత్తం పెళ్లి దుస్తులు, నగలు ధరించి గ్రౌండ్ లో క్రికెట్ బ్యాట్‌ పట్టుకొని ఫోటోషూట్ లో పాల్గొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆన్‌లైన్ ‌లో వైరల్ అవుతున్న ఈ కవర్ డ్రైవ్ మరియు పుల్ షాట్ ఫోటోలను ఐసీసీ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే సంజిదా ఇస్లాం తన 8 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్‌లో 16 వన్డేలు, 54 టీ20 లో బంగ్లాకు ప్రాతినిధ్యం వహించి వన్డేల్లో 174 పరుగులు, టీ 20 లో 520 పరుగులు సాధించింది.