మాస్క్ ధరించనిపై కొరడా ఝులిపించిన అధికారులు

మాస్క్ ధరించనిపై కొరడా ఝులిపించిన అధికారులు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో మాస్క్, భౌతిక దూరం పాటించని వారి పై  బండ్లగూడ మునిసిపల్ అధికారులు కొరడా ఝులిపించారు. మాస్క్ ధరించని వారికి 500 రూపాయల వరకు జరిమానా విధించారు. మరోవైపు బండ్లగూడలో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి ఫైన్లతో మోతమోగించారు. హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, ట్రిపుల్ రైడింగ్ చేసే వారి పై భారీ జరిమానా వేశారు. మాస్క్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై సీరియస్ గా వ్యవహరించారు పోలీసులు. ఇక, బండ్లగూడ లోని ఓ హోటల్ తో పాటు వైన్స్ పై దాడులు నిర్వహించిన మునిసిపల్ అధికారులు.. మాస్క్ లేకుండా, భౌతిక దూరం పాటించ కుండా క్రయ, విక్రయాలు చేస్తునందుకు జరిమానాలు విధించారు.. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరు ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు పాటించాలని సూచించారు. మొత్తంగా.. మాస్క్ ధరించని వారిపై, భౌతిక దూరాన్ని పాటించనివారి నుంచి 100 నుండి 500 రూపాయల జరిమానా విధించారు మున్సిపల్ అధికారులు.