హమ్మయ్య...బండ్లన్న సేఫ్.!

    హమ్మయ్య...బండ్లన్న సేఫ్.!

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఆస్పత్రికి వెళ్లగా డాక్టర్ కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించారు. దాంతో ఆయన టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.   కరోనా భారిన పడటంతో ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. చికిత్స అనంతరం ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. కరోనా నుండి కోలుకోవటంతో ఆయన ఆనందంతో థాంక్ గాడ్ అంటూ తన రిపోర్ట్స్ ను పోస్ట్ చేసారు. ఇక బండ్ల గణేష్ కరోనా నుండి కోలుకోవటంతో ఆయన అభిమానులు "మా బండ్లన్న సేఫ్" అంటూ కామెంట్లు పెడుతున్నారు.